☎ +91 98497 45636✉ contact@reddyassociates.inహైదరాబాద్ · అమరావతి
పి. వీరభద్ర రెడ్డి, న్యాయవాది

పి. వీరభద్ర రెడ్డి

న్యాయవాది
ప్రాక్టీసు రంగాలు

సర్వీసు చట్టం, పరిపాలనా చట్టం: పెన్షన్ మరియు పదవీ విరమణ ప్రయోజనాలు, సీనియారిటీ మరియు పదోన్నతి, శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు, సస్పెన్షన్లు, విద్యా రంగంలో ఉపాధ్యాయ నియామకాలతో సహా నియామక వివాదాలు, ఆర్టికల్ 226 కింద రిట్ పిటిషన్లు.

నేపథ్యం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ అదనపు సంచాలకులుగా (Additional Director of School Education) పదవీ విరమణ చేశారు. శాఖలో పనిచేసిన సంవత్సరాల్లో ప్రభుత్వ శాఖలు ఎలా పనిచేస్తాయో, వాటి అధికార క్రమం, విధానాలు ఏమిటో ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.) రూపకల్పనలో దగ్గరగా పాల్గొన్నారు; సర్వీసు నియమాలు ఆచరణలో ఎలా అమలవుతాయో, వాటిని ఎలా సవాలు చేస్తారో ఈ అనుభవం ద్వారా ఆయనకు అవగాహన ఉంది.

పదవీ విరమణ చేసిన వెంటనే 2008లో ప్రాక్టీసు ప్రారంభించి, దాదాపు రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రిబ్యునల్ నుండి హైకోర్టుల వరకు సర్వీసు వ్యవహారాలు చూస్తున్నారు. సర్వీసు నియమాలు, సంబంధిత వ్యాజ్యాలపై ప్రభుత్వ ఉద్యోగులకు సలహాలు కూడా ఇస్తారు.

న్యాయస్థానాలు

ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు.

డా. కె. సుధాకర్ రెడ్డి, న్యాయవాది

డా. కె. సుధాకర్ రెడ్డి

న్యాయవాది
ప్రాక్టీసు రంగాలు

సర్వీసు మరియు ఉద్యోగ చట్టం, కార్మిక చట్టం, పరిపాలనా చట్టం: ప్రభుత్వ సర్వీసు నియమాలు, కార్మిక చట్టాల అమలుకు సంబంధించిన వ్యవహారాలు.

నేపథ్యం

2017లో న్యాయవాదిగా నమోదు చేసుకుని, 2020 నుండి సర్వీసు మరియు ఉద్యోగ వ్యవహారాల్లో ప్రాక్టీసు చేస్తున్నారు. ప్రాక్టీసుకు ముందు మూడు దశాబ్దాలకు పైగా ప్రజా సేవలో ఉన్నారు; చివరిగా తెలంగాణ రవాణా శాఖ మంత్రికి (2014–2019), కార్మిక, ఉపాధి & శిక్షణ మరియు మహిళా & శిశు సంక్షేమ శాఖ మంత్రికి (2019–2020) ప్రత్యేక విధుల అధికారిగా (OSD) పనిచేశారు.

అంతకుముందు జాతీయ బాల కార్మిక ప్రాజెక్టు ప్రాజెక్టు డైరెక్టర్; ఉప్పల్ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్; సర్వ శిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్; ఏ.పి. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ జిల్లా మేనేజర్; రంగారెడ్డి జిల్లా ప్రాథమిక విద్యా ప్రాజెక్టు (DPEP) అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్; హైదరాబాద్ రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ (SIET) లెక్చరర్‌గా పనిచేశారు.

విద్యార్హతలు

పిహెచ్‌డి, ఎల్‌ఎల్‌బి, ఎంఎడ్, ఎంఏ (సామాజిక శాస్త్రం), ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్.

న్యాయస్థానాలు

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.

సంస్థను సంప్రదించండి

హైదరాబాద్, అమరావతిలో కార్యాలయాలు; తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల్లో సేవలు.

సంప్రదింపు వివరాలు